IND vs WI Test: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ నేడు (అక్టోబర్ 10) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైంది. తొలి టెస్ట్‌ను ఘనంగా గెలిచిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా, ఈ మ్యాచ్‌లోనూ అదే ఉత్సాహంతో ఆడేందుకు సిద్ధమైంది. ఇక రెండో టెస్ట్ టాస్‌లో అదృష్టం టీమిండియాకే దక్కింది. గిల్ తన కెప్టెన్సీలో తొలి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక…
టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు దిగ్గజాలు వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో రోహిత్, కోహ్లీల భవితవ్యంపై చర్చలు జరిగాయి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఇద్దరు చోటు దక్కించుకున్నా.. ఇంకా రెండేళ్ల సమయం ఉన్న 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడడం అనుమానమే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు…
శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అక్టోబర్ 4న గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. హిట్‌మ్యాన్ ఫాన్స్ అయితే బీసీసీఐపై మండిపడ్డారు. తాజాగా రోహిత్ తన వన్డే కెప్టెన్సీ వేటుపై స్పందించాడు. ఇక వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు…
2027 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడడం డౌటే అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. మెగా టోర్నీకి చాలా సమయం ఉందని.. అప్పటివరకు ఇద్దరు తమ ఫామ్, ఫిట్నెస్ను ఎలా కాపాడుకుంటారో చూడాలన్నాడు. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడంతో కోహ్లీ, రోహిత్‌లను జట్టు నుంచి పక్కన పెట్టేసినట్లు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడమే అని ఏబీడీ పేర్కొన్నాడు. అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆరంభం…
Ajit Agarkar: భారత క్రికెట్లో ఒక శకం ముగిసి.. మరో కొత్త శకానికి తెర లేపినట్లుగా బీసీసీఐ తాజాగా ఒక సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అది ఏదో కాదు.. శుభ్‌మన్ గిల్ ఇకపై భారత వన్డే జట్టుకు నూతన కెప్టెన్ గా చేయడమే. దేశానికి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత ఉన్నప్పటికీ.. 38 ఏళ్ల రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంతో 26 ఏళ్ల గిల్ ఇప్పుడు…
Abhishek Sharma: 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, భారత క్రికెట్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ తన శిష్యుడు అభిషేక్ శర్మ కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. యువరాజ్ సింగ్ శిక్షణలో శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా తన బ్యాటింగ్ టెక్నిక్‌ను ఎలా మెరుగుపరుచుకున్నాడో అభిషేక్ శర్మ ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ కార్యక్రమంలో వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో యువరాజ్ శిక్షణ అభిషేక్‌కు ఎంతగానో ఉపయోగపడిందని అందులో చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే…
IND vs WI: అహ్మదాబాద్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ పిచ్ మంచిగా ఉందని, ఇందులో తేమ ఎక్కువగా ఉన్నప్పటికీ తమ ఆటగాళ్లు బాగానే ఆడతారని చేజ్ పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీలో పాయింట్లు సాధించడం తమ లక్ష్యమని, ఈ పిచ్‌పై చివరిగా బ్యాటింగ్ చేయాలనుకోవడం లేదని తెలిపాడు. ఇక వెస్టిండీస్ తరపున ఖారీ పియెర్, జోహాన్ లేన్ అరంగేట్రం…
India vs West Indies Test: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య నేటి (గురువారం) నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టు ప్రారంభం కానుంది. భారత గడ్డపై సాధారణంగా కనిపించే పరిస్థితులకు భిన్నంగా ఈ టెస్టు మ్యాచ్ సాగనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ కండిషన్స్ పూర్తిగా భిన్నంగా ఉండనున్నాయి. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భారత్‌కు ఇది తొలి హోమ్ సిరీస్. ఈ ఏడాది ఫైనల్ కు…
India vs WI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. యువ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇకపోతే, ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన జట్టుతో పోలిస్తే కొన్ని స్వల్ప మార్పులు చేశారు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సిరీస్‌కు…