Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో పిటిషనర్ అశుతోష్ పాండేకు ఫేస్‌బుక్‌లో పాకిస్థాన్ నుంచి బెదిరింపు వచ్చింది. దీనిపై పాండే పోలీసులకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, రాష్ట్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
దేశంలో ఓవైపు జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. వారణాసి కోర్ట్ తో పాటు సుప్రీం కోర్ట్ లోొ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవల వారణాసి కోర్ట్ ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇందులో భాగంగా మసీదులోని ‘వాజు ఖానా’లో బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే సుప్రీం కోర్ట్ బయటపడిన శివలింగానికి రక్షణ ఇవ్వాలని వారణాసి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు…