డిజిటల్ పేమెంట్స్ పెరిగాక అమ్మకాలు, కొనుగోళ్ళు సులభతరం అయ్యాయి. అనేక స్మాల్ ఫైనాన్స్, Pay Later సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేజర్ పే, క్యాష్ ఫ్రీకి షాకిచ్చింది. ఈ రెండు సంస్థలు కొత్త వినియోగదార్లను చేర్చుకోవడాన్ని తాత్కాలికంగా ఆపేయాలని ఆదేశించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) mరేజర్‌పే, క్యాష్‌ఫ్రీ సంస్థలకు నోటీసులు జారీచేసిందని తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇవి తాత్కాలిక ఆదేశాలు మాత్రమేనని, దీని వల్ల రేజర్‌పే ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలు, వ్యాపార సంస్థలపై ఎలాంటి ప్రభావం పడదని అంటున్నారు.
Read Also:Bharat Series Registrations: భారత్ సిరీస్ నెంబర్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
‘చెల్లింపులను ప్రాసెస్ చేసేందుకు, పేమెంట్ గేట్‌వే లైసెన్సు కోసం జులైలో ఆర్‌బీఐ మాకు సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. తుది లైసెన్సు ప్రక్రియ కోసం ఆర్‌బీఐకి అదనపు వివరాలు సమర్పించాలి. ఈ వివరాలు సమర్పించే వరకు కొత్త వినియోగదార్లను చేర్చుకోవడాన్ని ఆపేయాల్సిందిగా ఆర్‌బీఐ కోరింద’ని రేజర్ పే ప్రతినిధులు వెల్లడించారు. ఒక బాధ్యతాయుత కార్పొరేట్ సంస్థగా ఆర్‌బీఐ ఆదేశాలు పాటిస్తామని, దీని వల్ల తమ ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం ఉండదని అంటున్నారు. రేజర్‌పేఎక్స్, కార్పొరేట్ కార్డ్, ఈజ్‌ట్యాప్ ద్వారా ఆఫ్‌లైన్ చెల్లింపులకు సంబంధించి కొత్త వినియోగదార్లను చేర్చుకోవడం కొనసాగుతుందని తెలిపారు. ఆర్‌బీఐ ఆదేశాలపై క్యాష్‌ఫ్రీ నుంచి ఇప్పటివరకు స్పందించలేదు.
Read Also: Malaysia Landslide: కొండచరియలు విరిగిన ఘటనలో 21కి చేరిన మృతుల సంఖ్య.. 12 మంది గల్లంతు