ప్రముఖ హీరో అడవిశేష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. ఈ ‘డెకాయిట్’ షూటింగ్ స్పాట్‌లో చిన్న ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో హీరో, హీరోయిన్ ఇద్దరూ ప్రమాదవశాత్తు క్రింద పడి గాయాలపాలయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం, గాయాలు కాస్త తీవ్రంగానే ఉన్నప్పటికీ, వారు ధైర్యంగా షూటింగ్‌ను పూర్తి చేశారని తెలుస్తోంది. ‘డెకాయిట్’ చిత్రం హై-ఓక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిస్తున్న ఒక భారీ ప్రాజెక్ట్. ఈ ప్రమాదం ఒక యాక్షన్ సీక్వెన్స్ సమయంలో జరిగినట్లు సమాచారం.…
హీరోయిజం అంటే కేవలం తెరమీద ఆపదలో ఉన్న వారిని కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాటం చేయడమే కాదు.. తెర వెనుక కూడా చేయాలి. అప్పుడే వారు నిజమైన హీరోలు అనిపించుకుంటారు. ఇలా తెరమీద.. తెర వెనుక కూడా హీరోలుగా మారే మనస్తత్వాలు అతి కొద్దిమందికి మాత్రమే ఉంటాయి. వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఏదైనా పని అనుకుంటే చేసి తీరాలి అనే పట్టుదల ఆయనకు ఎక్కువ. అలాగే సాటి మనిషి…