తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. తెల్లవారుజామున బయటకు రావాలంటేనే వణికిపోయే పరిస్థితులు వస్తున్నాయి.. ఇక, ఏజెన్సీల్లో అయి మరీ దారుణంగా పరిస్థితులు ఉన్నాయి.. అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో కనిష్ట స్థాయికి పడిపోయాయి ఉష్ణోగ్రతలు.. ఈ సీజన్ లో తొలిసారి సింగిల్ డిజిట్ నమోదు అయ్యింది.. ఈ రోజు ముంచింగిపుట్టులో 9 డిగ్రీల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు..