Firing At Golden Temple premises: పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై తుపాకీతో దాడి జరిగింది. అయితే, దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ వెలుపల ఈ ఘటన జరిగింది. స్వర్ణ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి అకస్మాత్తుగా తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే, అక్కడున్న వ్యక్తులు తుపాకీ బయటకు తీసి సమయంలో…
శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (62) శనివారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పంజాబ్ మాజీ విద్యాశాఖ మంత్రి దల్జిత్ ఎస్ చీమా ట్వీట్ చేశారు.
Akali Dal: పంజాబ్‌లో వరస ఓటములతో ఢీలా పడిన శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ)కి ఊరట విజయం దక్కింది. ఈ పార్టీకి చెందిన అభ్యర్థి హర్జిందర్ సింగ్ ధామీ సిక్కుల అత్యున్నత సంస్థ అయిన శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SGPC) అధ్యక్షుడిగా వరుసగా నాలుగోసారి తిరిగి ఎన్నికయ్యారు.
Shiromani Akali Dal: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో శిరోమణి అకాళీదళ్ కీలక హామీలను ఇచ్చింది. పంజాబ్ జలంధర్‌లో ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ విడుదల చేశారు.
Lok Sabha polls: విడిపోయిన మిత్రులను బీజేపీ దగ్గరకు చేర్చుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న ఏన్డీయే కూటమి, అందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తో్ంది. పాత మిత్రులను అక్కున చేర్చుకుంటోంది. ఇప్పటికే పాత మిత్రలైన తెలుగు దేశం పార్టీ, కర్ణాటకలో జేడీఎస్ పార్టీలు ఏన్డీయేలోకి చేరాయి.
Uniform Civil Code: ప్రధాని నరేంద్రమోడీ యూనిఫా సివిల్ కోడ్(యూసీసీ)పై కీలక వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ముస్లిం సంస్థలు, పలు రాజకీయ పార్టీలు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సిక్కులకు సంబంధించి అత్యున్నత సంస్థగా ఉన్న శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) యూనిఫాం సివిల్ కోడ్ ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో వారం క్రితం మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ.. దేశ రాజధాని ఢిల్లీకే పరిమితమైన ఆ పార్టీ.. మరో రాష్ట్రంలో గ్రాండ్ విక్టరీ కొట్టింది… ఇక, ఆప్ ప్రభంజనం ముందు.. సీఎం, మాజీ సీఎంలు.. ఏకంగా ఐదుసార్లు పంజాబ్ సీఎంగా సేవలందించిన నేతకు కూడా ఓటమితప్పలేదు.. మాజీ సీఎం, కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్‌ను కూడా మట్టికరిపించింది ఆమ్ ఆద్మీ పార్టీ.. 94 ఏళ్ల బాదల్.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచిన అత్యధిక…