Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూ చండీగఢ్ లోని ముల్లన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్, ఆఫ్ఘన్ బ్యాటర్ రహ్మత్ షా మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..?
ఆఫ్ఘన్ బ్యాటర్ షరాఫుద్దీన్ అష్రఫ్ కాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేస్తున్నాడు. తన భాగస్వామి ఇబ్బంది పడుతుండటంతో రహ్మత్ షా పూర్తిగా డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. సిరాజ్ వేసిన ఓవర్ మూడో బంతిని రహ్మత్ బ్లాక్ చేయగా.. క్రీజులోనే ఉన్నప్పటికీ సిరాజ్ ఆగ్రహంతో బంతిని నేరుగా వికెట్ల వైపు బలంగా విసిరాడు.
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
సిరాజ్ అంతటితో ఆగలేదు. తర్వాతి బంతిని కూడా రహ్మత్ డిఫెండ్ చేయడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. రహ్మత్ దగ్గరకు వెళ్లి, డిఫెన్స్ ఆడటం ఆపి, సరైన షాట్లు ఆడాలంటూ సవాల్ విసిరాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాడీవేడీ చర్చ నడిచింది.
Siraj aur Rahmat ke darmiyan field par garma-garmi 🫢 pic.twitter.com/3MtEjwIRHc
— Rehan 56 (@imrehan456) June 8, 2026
భారత్ చారిత్రాత్మక విజయం..
సిరాజ్ స్లెడ్జింగ్ మైండ్ గేమ్‌లా పనిచేసింది. ఆ తర్వాత కొద్ది ఓవర్లలోనే అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్‌లో షరాఫుద్దీన్, రహ్మత్ షా ఇద్దరూ వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై చారిత్రాత్మక విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 564/8 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌట్ అయింది. సుతార్ 6 వికెట్లతో చెలరేగాడు. ఫాలోఆన్ ఆడిన ఆఫ్ఘన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. 2018లో రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ మరియు 272 పరుగుల తేడాతో సాధించిన విజయాన్ని అధిగమించి భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!