మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ కలయికలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమైంది ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’. ఈ ప్రెస్ మీట్లో పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించిన విజయ్ సేతుపతి (సేతు సార్)కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ సేతుపతి లాంటి అపారమైన నటన సామర్థ్యం ఉన్న స్టార్ హీరో.. ఇలాంటి ఒక వైవిధ్యమైన మిస్టరీ కథను నమ్మి సైన్ చేయడం తాము నమ్మలేకపోయామని ఎమోషనల్ అయ్యారు.
విజయ్ సేతుపతి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. “సేతు సార్ సింప్లిసిటీ చూసి నేను షాక్ అయ్యాను. ఆయన అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్స్ పైకి వస్తే ఒక కొత్త నటుడిలా ఎంతో వినయంగా ఉంటారు. మీరు గమనిస్తే.. ఆయన నటనలో గానీ, సినిమాలో ఒక్క ఫ్రేమ్‌లో గానీ ఎక్కడా ‘అహంకారం’ కనిపించదు. ఈ క్వాలిటీ నిజంగా ఇన్స్పైరింగ్. ఈ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ చూడని ఒక పవర్ఫుల్ మరియు డిఫరెంట్ విజయ్ సేతుపతిని చూస్తారు” అని కొనియాడారు. సినిమా కథాంశం గురించి పూరీ సంచలన విషయాలు బయటపెట్టారు.
Also Read
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
“ఈ ‘స్లమ్‌డాగ్’ సినిమా పూర్తిగా మన చుట్టూ జరిగే యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సాధారణంగా మనం రోడ్లపై వెళ్తున్నప్పుడు భిక్షాటన చేసే వారిని చూసి చూడనట్లు వదిలేస్తాం, వారిని పూర్తిగా ఇగ్నోర్ చేస్తాం. కానీ, అసలు ఆ బిచ్చగాళ్లు ఎవరు? వారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వారి వెనుక ఎన్ని గుండెకోతలు, ఎంత పెద్ద కథలు, ఎమోషన్స్ ఉన్నాయి అనేది ఎవరికీ తెలియదు. ఈ సినిమాలో ఆ పాయింట్‌ను పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో, గుండెల్ని పిండేసే ఎమోషన్స్‌తో చూపించబోతున్నాం” అని క్లారిటీ ఇచ్చారు. కన్నడ సూపర్ స్టార్ విజయ్ కుమార్ దునియా ఈ సినిమాలో మెయిన్ విలన్ (Bad Guy) పాత్రలో కనిపించబోతున్నారు. సీనియర్ నటి జరీనా వహాబ్ తల్లి పాత్రలో నటించగా.. ఆమె పండించిన ఎమోషన్స్ చూసి సెట్లోనే కన్నీళ్లు వచ్చాయని దర్శకుడు తెలిపారు. వీరితో పాటు టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ, రోహన్, ముఠా రాజేంద్రన్, గణేష్ కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..