ఫైల్స్ దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్స్ దగ్ధం కేసులో మదనపల్లె మాజీ ఆర్డీవో మురళిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత పరార్ అయిన మురళి కోసం మదనపల్లి, తిరుపతి, హైదరాబాద్ లో అధికారులు గాలించారు. ఇక, తిరుపతిలోని కేఆర్ నగర్ లో ఉన్నట్లు తెలుసుకొని వెళ్లిన అతడ్ని సీఐడీ డీఎస్పీ డీవీ వేణుగోపాల్ బృందం అరెస్టు చేసింది.…
మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్‌కు నటుడు షైన్ టామ్ చాకో బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. షూటింగ్ సమయంలో జరిగిన దానికి తాను క్షమాపణలు చెబుతున్నా అని, కావాలని చేసింది కాదని చాకో తెలిపారు. ఆ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. చాకో నుంచి అలాంటి అనుభవంను తాను అస్సలు ఊహించలేదని విన్సీ చెప్పారు. వివాదం సమసిపోయినందుకు సంతోషంగా ఉందన్నారు. చాకో, విన్సీ కలిసి నటించిన చిత్రం ‘సూత్రవాక్యం’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా త్రిస్సూర్‌లోని పుతుక్కాడ్‌లో…