Shiekh Hasina: రిజర్వేషన్ కోటా రద్దు ఆందోళనలు చివరకు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయేలా చేశాయి. ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా దేశం వదిలినప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా షేక్ హసీనాతో పాటు ఆమె మాజీ కేబినెట్ మంత్రులు, సహాయకులపై మరో నాలుగు హత్య కేసులు నమోదు అయ్యాయని ఆదివారం మీడియా నివేదికలు తెలిపాయి.