Teesta water issue: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండు రోజుల క్రితం భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీతో పలు ఒప్పందాలు చేసుకున్నారు. దీంట్లో తీస్తా నది నీటి నిర్వహణపై మోడీ-హసీనాలు చర్చించారు. అయితే, దీనిపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనలో ఉన్నారు. షేక్ హసీనాతో చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్, బంగ్లాదేశ్‌లు అంగీకరించాయని, మొత్తం సంబంధాలను పెంపొందించేందుకు భవిష్యత్తు దృష్టిని రూపొందించుకున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్ భారతదేశానికి అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని, ఆ దేశంతో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కొత్త రంగాలలో భారతదేశం-బంగ్లాదేశ్ సహకారానికి భవిష్యత్తు దార్శనికత సిద్ధమైందని ప్రధాని మోడీ తెలిపారు. డిజిటల్…
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. మోడీ ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందుగానే శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన మోడీ ప్రమాణస్వీకారానికి షేక్ హసీనా పాల్గొన్నారు. సోమవారం కూడా ఆమె పర్యటన ఢిల్లీలో కొనసాగుతోంది.
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆమెకు భారీ ఘన స్వాగతం లభించింది. మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు
Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రతిపక్షాల ఎన్నికల బహిష్కరణ నడుము 40 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. ప్రధాన మంత్రి షేక్ హసీనా వరసగా నాలుగోసారి అధికారంలోకి రావడం దాదాపుగా ఖాయమైంది. ప్రధాన ప్రతిపక్షమై బీఎన్పీ దాని మిత్రపక్షాలు పోలీటో పాల్గొనలేదు. ఆదివారం జరిగిన ఓటింగ్‌లో ఓటేసేందుకు చాలా తక్కువ మంది వచ్చారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
Bangladesh Election Today: బంగ్లాదేశ్ జాతీయ అసెంబ్లీ పన్నెండవ ఎన్నికలకు ఆదివారం (07 జనవరి) ఓటింగ్ ప్రారంభమైంది. ప్రధానమంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌తో సహా మొత్తం 27 పార్టీలు ఈ ఎన్నికల్లో పాల్గొన్నాయి,
Election Polling Starts in Bangladesh: బంగ్లాదేశ్‌లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దేశం అంతటా ఆదివారం ఉదయం 8 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. జనవరి 8 నుంచి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షం అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికలను బహిష్కరించింది. బీఎన్పీకి ఇతర భావసారూప్యత పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి. అయినప్పటికీ బంగ్లాదేశ్‌లోని 300…
Bangladesh Agitations: బంగ్లాదేశ్ ప్రధాని హసీనా పై ప్రజలనుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని ఢాకా ఆందోళనకారులతో నిండిపోయింది.