Shehbaz Sharif: తీవ్ర ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదం, ఉగ్రవాదం, మతఛాందసవాదంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పెద్దపెద్ద సవాళ్లు చేస్తోంది. ఏ దశలోనూ భారత్‌తో పోలిక లేదు, అయినా భారత్‌ని ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతోంది. తినడానికి తిండి లేకపోయినా, కింద కోట్ల అప్పులు ఉన్నా కూడా వాస్తవాలను మరిచి ప్రవర్తించడం పాకిస్తాన్‌కే చెల్లుతోంది. తాజాగా, ఆ దేశ ప్రధాని షెహజాబ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించేలా ఉన్నాయి.