తొమ్మిది పదుల వయసులో నేటికీ తొణక్క బెణక్క హుషారుగా సాగుతున్న మేటి నటి షావుకారు జానకి కీర్తి కిరీటంలో తొలి పద్మ అవార్డు చోటు చేసుకుంది. 72 సంవత్సరాల నటనాజీవితం గడిపిన షావుకారు జానకి వంటి మేటి నటికి ఇన్నాళ్ళకు, ఇన్నేళ్లకు పద్మశ్రీ పురస్కారం లభించడం ఆమె అభిమానులకు ఆనందం పంచుతోంది. అయితే, చాలా ఆలస్యంగా జానకికి ఈ అవార్డు లభించిందని కొందరు ఆవేదన చెందుతున్నారు. జానకి మాత్రం ఎప్పుడు వచ్చింది అన్నది ముఖ్యం కాదు, ప్రభుత్వం…
సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే వారందరిలోకీ షావుకారు జానకి స్థానం ప్రత్యేకమైనది. నటిగానే కాదు వ్యక్తిత్వంలోనూ షావుకారు జానకి తనదైన శైలిని ప్రదర్శించారు. స్త్రీ అంటే నాలుగు గోడల మధ్య ఉండే వస్తువు కాదని, ఆ రోజుల్లోనే నిరూపించిన సాహసవంతురాలు జానకి! పెళ్ళయి, ఓ బిడ్డ తల్లయిన తరువాత కూడా తన స్వశక్తితో ముందుకు సాగాలని భావించారామె. అందుకు చిత్రసీమను వేదికగా ఎంచుకోవడం నిస్సందేహంగా సాహసమే! ఆ రోజుల్లో అయితే మరింత…