షర్మిలా టాగోర్ ఒకప్పుడు ఆసేతు హిమాచల పర్యంతం అభిమానగణాలను సంపాదించి, ఎందరో రసికుల కలలరాణిగా జేజేలు అందుకున్నారు. షర్మిల నటించిన ప్రేమకథా చిత్రాలు చూసి, ఆమె వీరాభిమానులుగా మారినవారెందరో! ఆమెపై అభిమానంతో తమ ఆడపిల్లలకు ‘షర్మిల’ అని నామకరణం చేసిన వారూ లేకపోలేదు. అంతలా ఆ రోజుల్లో అభిమానులను ఆకట్టుకున్న షర్మిలకు ప్రస్తుతం 75 ఏళ్ళ వయసు. ఆమె తనయుడు సైఫ్ అలీఖాన్, కూతురు సోహా అలీఖాన్ సైతం తల్లి బాటలో పయనించి, నటులుగా అలరించారు. అందులో…