Bangladesh: బంగ్లాదేశ్ మరోసారి అగ్నిగుండంగా మారింది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాలో హింసకు కారణమైంది. షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థి నేతల్లో హాది కీలకంగా వ్యవహరించాడు. ఇతడిని గుర్తుతెలియని వ్యక్తులు దగ్గర నుంచి కాల్చారు.
Bangladesh Unrest: షేక్ హసీనాపై తిరుగుబాటు సమయంలో అట్టుడికిన బంగ్లాదేశ్, మరోసారి ఉద్రిక్తంగా మారింది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత మరణం తర్వాత, ఆ దేశం అల్లర్లతో హింసాత్మకంగా మారింది. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి.