సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ “దక్ష” ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు. 2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం శుక్రవారం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. Also Read:Shruti Haasan: నేను ఆయన కూతుర్ని కాదు.. అందుకే…
శరత్ బాబు, కమల్ హాసన్ కలసి అనేక చిత్రాలలో నటించారు. వాటిలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన “సాగరసంగమం, స్వాతిముత్యం” చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలలో కమల్ హాసన్ అభినయం చూసి మన దేశంలో నటనకు ‘ఆస్కార్ అవార్డ్’ అంటూ వస్తే అది కమల్ తోనే మొదలవుతుంది అంటూ శరత్ బాబు అనేవారు. ఆ మాటను కె.విశ్వనాథ్ సైతం బలపరిచారు. అలా కమల్ కు ఆస్కార్ అంటూ అప్పట్లో సినిమా పత్రికల్లో ఆకర్షణీయమైన కథనాలు ప్రచురితమయ్యాయి.…
అందం, అభినయం కలబోసిన రూపం ఉన్నా ఎందుకనో రమాప్రభ నాయికగా రాణించలేక పోయారు. 1970ల ఆరంభంలోనే స్టార్ కమెడియన్ అనిపించుకున్నారు రమాప్రభ. అప్పట్లో ఎంతోమంది సినిమా ప్రయత్నాలు చేసేవారికి రమాప్రభ అండగా నిలిచారు. కొందరికి ఆర్థిక సాయం, మరికొందరికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ‘కన్నెవయసు’ చిత్రంలో హీరోగా నటించిన లక్ష్మీకాంత్ అప్పట్లో వర్ధమాన కథానాయకుడు. లక్ష్మీకాంత్ కు శరత్ బాబు ఫ్రెండ్. ఆ లక్ష్మీకాంత్ ద్వారా శరత్ బాబు రమాప్రభకు పరిచయం అయ్యారు. ఆ తరువాత…
గత కొంతకాలంగా హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్న ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. నటుడు శరత్ బాబు జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస. తండ్రి విజయశంకర దీక్షితులు, తల్లి సుశీలాదేవి. మొత్తం పదమూడు మంది సంతానం. ఎనిమిది మంది అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్ళు. జూలై 31, 1951న ఆయన జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సత్యం బాబు దీక్షితులు. అయతే ముద్దుగా శరత్ బాబును ‘సత్యంబాబు’ అని పిలిచే వారు. పి.యు.సి. ఆముదాల వలసలో పూర్తి…
కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్ తేజస్ స్పందించారు. మా పెదనాన్న శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు కొంచెం కోలుకున్నారని ఆయుష్ చెప్పుకొచ్చారు.
తెలుగు చిత్రసీమలో బాపు తీతకు, ముళ్ళపూడి వెంకటరమణ రాతకు విశేషస్థానముంది. వారి జోడీ సాంఘికం తీసినా, పౌరాణికం తెరకెక్కించినా, రీమేక్స్ అందించినా జనం అభిమానించారు, ఆదరించారు. స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, పరభాషల్లో విజయం సాధించిన చిత్రాలకు తెలుగుదనం అద్ది అందించడంలోనూ బాపు-రమణ తమదైన బాణీ పలికించారు. అలా వారి అద్దకంలో వెలుగు చూసిన చిత్రాల్లో ‘రాధా కళ్యాణం’ ఒకటి. తమిళంలో భాగ్యరాజా స్వీయదర్శకత్వంలో నటించిన ‘అంద 7 నాట్కల్’ చిత్రం ఆధారంగా ఈ ‘రాధా కళ్యాణం’…
నవంబర్ 2 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సూర్య ‘జై భీమ్’ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్ళంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు. థియేటర్లలో రిలీజ్ చేయాల్సిన మంచి చిత్రాన్ని సూర్య ఓటీటీలో విడుదల చేసి తప్పు చేశారని కొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు. సూర్య అభిమానులు మాత్రమే కాకుండా, మంచి సినిమాను ప్రేమించే అందరూ ‘జై భీమ్’ చిత్రాన్ని సొంతం చేసుకుని విశేష ప్రచారం…