ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ దశలో బెయిల్‌పై విడుదల చేయడం సరికాదని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్ గార్గ్ మిశ్రా బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చారు.
విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన నెల తర్వాత వృద్ధురాలు ఫిర్యాదు చేయడం, ముంబైకి చెందిన శంకర్ మిశ్రా పరారీలో ఉండటం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Air India Incident: ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన విమానయాన రంగంలో ప్రకంపనలు రేపుతోంది. నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా తన తోటి ప్రయాణికురాలు సీనియర్ సిటిజన్ అయిన మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మద్యంమత్�