సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ చెప్పిన ‘కొండారెడ్డి బురుజు దగ్గర అల్లూరి సీతారామరాజుని చూసాను’ అనే డైలాగ్ ఘట్టమనేని అభిమానులకి కిక్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే కిక్ ని అనుభవించడానికి మెగా అభిమానులు రెడీ అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘RC 15’ షూటింగ్ కోసం చరణ్, కర్నూల్ వెళ్లనున్నాడు. రేపు కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు దగ్గర,…