సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ చెప్పిన ‘కొండారెడ్డి బురుజు దగ్గర అల్లూరి సీతారామరాజుని చూసాను’ అనే డైలాగ్ ఘట్టమనేని అభిమానులకి కిక్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే కిక్ ని అనుభవించడానికి మెగా అభిమానులు రెడీ అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘RC 15’ షూటింగ్ కోసం చరణ్, కర్నూల్ వెళ్లనున్నాడు. రేపు కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు దగ్గర, బురుజు పరిసర ప్రాంతాల్లో రామ్ చరణ్ కి సంబంధించిన సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం బయటకి రావడంతో కర్నూల్ జిల్లా మెగా అభిమానులు చరణ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు.
Read Also: Akkineni Brothers: ఒకే తేదీకి రానున్న అన్నదమ్ములు
ఇదిలా ఉంటే ‘RC 15’ లేటెస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో జరిగింది. ఈ షెడ్యూల్ లో చరణ్, శ్రీకాంత్ ల మధ్య కీలక సన్నివేశాలని షూట్ చేశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సీన్స్ ని చిత్ర యూనిట్ సీక్రెట్ గా షూట్ చేస్తుంటే, లొకేషన్ లో ఉన్న మెగా అభిమానులు ఆనందం ఆపుకోలేక చరణ్ లుక్ తో పాటు, ఫ్లాష్ బ్యాక్ లోనే మెయిన్ పాయింట్ అయిన ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ ని కూడా లీక్ చేసేశారు. ట్విట్టర్ లో ప్రస్తుతం ‘RC 15’ రాజమండ్రి షెడ్యూల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ‘RC 15’ సెట్స్ నుంచి చరణ్ లుక్ ని లీక్ చెయ్యడం ఇదే మొదటిసారి కాదు, గతంలో జరిగిన వైజాగ్ షెడ్యూల్ నుంచి కూడా చరణ్ మోడరన్ లుక్ కి సంబంధించిన ఫోటోస్ తో పాటు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తో చరణ్ గొడవపడే వీడియోని కూడా లీక్ చేశారు. తమ హీరోని చూడాలి అనుకునే అభిమానం ఎంత ఉన్నా కూడా అది సినిమాకి నష్టం కలిగిస్తుందని తెలుసుకోని మెగా అభిమానులు కర్నూల్ షెడ్యూల్ నుంచి అయినా ‘RC 15’ లీక్స్ చెయ్యకుండా ఉంటారేమో చూడాలి.
Read Also: RC 15: అభిమానులే శత్రువులు… ఇలాంటివి లీక్ చేస్తే ఎలా?