Langya henipavirus: చైనా వూహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కరోనా బారిన పడ్డాయి. కరోనా వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తారుమారయ్యాయి. దివాళా అంచుకు చేరుకుంటున్నాయి. ఇదిలా ఉంటే చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. షాన్ డాంగ్, హెనాన్ ప్రావిన్స్ లో లాంగ్యా హెనిపా వైరస్ విస్తరిస్తోంది. ఈ రెండు ప్రావిన్సుల్లో ప్రజలుకు ఈ వ్యాధి సోకినట్లు చైనా మీడియా మంగళవారం ప్రకటించింది.…