శంషాబాద్ గొల్లపల్లిలో వీరంగం సృష్టించారు బీహారీలు. రాత్రిళ్లు రోడ్ల పైకి వచ్చే వారిపై దాడులు చేస్తున్నారు బీహార్ కు చెందిన యువకులు. మద్యం మత్తులో రాడ్లు, కర్రలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి బైక్ పై వెళ్తున్న వాళ్ళ పై దాడులు చేస్తున్నారు. నిన్న రాత్రి గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకులపై రాడ్లు, కర్రలతో దాడి చేసారు. ఈ దాడిలో 8 బైక్ లు ధ్వంసం కాగా ఇద్దరు యువకులకు గాయాలు అయ్యాయి. పోలీసులకు బాధిత యువకులు ఫిర్యాదు…
శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు సర్విస్ రోడ్డుపై కారు భీభత్సం ఇద్దరు యువకులకు గాయాలు హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డు సర్విస్ రోడ్డు చెన్నమ్మ హోటర్ వద్ద బ్రీజా కారు భీభత్సం సృష్టించి కాల్వట్టులోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. కారులో ఉన్న ఇద్దరు…
నెల వ్యవధిలో కరోనా మహమ్మారితో తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోదరి మృత్యువుతో హాస్పిటల్ లో పోరాడుతుంది. తోండుపల్లి గ్రామానికి చెందిన పెదిరిపాటి సుభాష్ గౌడ్ (50) చంద్రిక దంపతులకు ఏప్రిల్ 28న, 25వ వివాహ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే అప్పటికే సుభాష్ గౌడ్ తో పాటు అయన భార్య చంద్రిక, కుమారుడు, తల్లి సోదరికి కరోనా సోకింది. సాధారణ జ్వరం అనుకుని…
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుకున్నారు. దోహ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ లేడి ప్యాసింజర్ వద్ద 53 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించారు డీఆర్ఐ అధికారులు. ఈస్ట్ ఆఫ్రికా జాంబియా నుండి భారీ మొత్తం లో మత్తు పదార్ధాలు హైదరాబాద్ కు ఎక్స్ పోర్ట్ అవుతున్నాయనే పక్కా సమాచారంతో శంషాబాద్ లో మాటు వేశారు డీఆర్ఐ అధికారులు. దోహా నుండి వచ్చిన ఆఫ్రికా దేశస్థురాలి పై అనుమానం వచ్చి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో…