ప్రస్తుత సమాజంలో నేటి యువత మద్యానికి బానిసై తమ నిండు జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. తాగిన మత్తులో కన్నుమిన్ను ఎరుగక అనర్థాలకు పాల్పడుతున్నారు. ఆడమగ అని తేడా లేకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడి ఎక్కడ పడితే అక్కడ గొడవలకు పాల్పడుతున్నారు. అంతేకాదు తెలియని మైకంలో వాళ్లు చేస్తున్న ఆగడాలకు వాళ్లే బలి అవుతున్నారని తెలుసుకునేలోపే అనర్థాలు జరిగిపోతున్నాయి. మద్యం మత్తులో ఓయువతి హైదరాబాద్ లోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హల్ చల్ చేసింది. మద్యం మత్తులో…
సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు నియమాలను పాటించని పబ్ లు ఆజ్యం పోస్తున్నాయని తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఆగ్రం వ్యక్తం చేశారు. తెలంగాణ NSUI బృందం శంషాబాద్ ఎయిరో ప్లాజా కాంప్లెక్స్ లోని సిప్ ఆఫ్ స్కై,చికెన్ వైల్డ్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్ ల వద్దకు తనిఖీ కోసం వెళ్లారు. అర్థరాత్రి 12 గంటలకు మూసెయ్యాల్సిన పబ్ లు ఉదయం 3 గంటలకు కూడా ఇంకా నడుస్తూనే ఉండడంతో అక్కడి పబ్ నిర్వాహకులపై…
నగరంలోని శంషాబాద్ లోని సంగారెడ్డి మండల రిటైర్డ్ పంచాయితీ అధికారి సురేందర్ రెడ్డి ఇంట్లో గురువారం నాడు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2కోట్ల 31 లక్షల 63వేల 600 అక్రమ ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. అక్రమాస్తుల కేసులో సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సురేందర్‌రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు (ఏసీబీ) అరెస్టు చేశారు. గురువారం ఉదయం శంషాబాద్ లోని సంగారెడ్డి మండలలోని సురేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న ఆయన.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు.. ఈ పర్యటన కోసం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఇక్రిశాట్‌కు చేరుకోనున్న ప్రధాని మోడీ.. ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తారు.. ఇక, ఇక్రిశాట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్ జనరేషన్…
హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. మరోముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది కారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. శంషాబాద్…
విమాన ప్రయాణం ఎంతో సౌకర్యంగా వుంటుంది. క్షణాల్లో మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోవచ్చు. అది కూడా అంతా బాగుంటే.. అదే విమానానికి ట్రబుల్ వచ్చినా.. వాతావరణం అనుకూలించకపోయినా అంతే సంగతులు. మనం ఎక్కాల్సిన విమానానికి టికెట్లు బుక్ అయినా ఎక్కలేని పరిస్థితి వస్తే ఎలా వుంటుందో ఊహించలేం. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణికులను వదిలేసి వెళ్ళిపోయింది విమానం. దీంతో ఆకుటుంబం ఆందోళనలో వుంది. బయటకు వదలని సెక్యూరిటి సిబ్బంది తీరుతో…
నచ్చిన హోటల్‌కి వెళ్లి.. మెచ్చిన ఫుడ్ తిన్న తర్వాత.. సంతృప్తి చెందితే.. ఎవరైనా అక్కడి వెయిటర్‌కి టిప్పుగా కొంత డబ్బు ఇస్తుంటారు.. హోటల్, రెస్టారెంట్ రేంజ్‌ని బట్టి టిప్పు పెరిగిపోతుంటుంది.. కొందరు ఇవ్వకుండా వెళ్లిపోయేవారు కూడా లేకపోలేదు.. అయితే, టిప్పు ఇవ్వలేదని ఓ యువకుడిని వెయిటర్ చితకబాదిన ఘటన శంషాబాద్‌లో వెలుగు చూసింది.. Read Also: రూ.3,520 కోట్లకు చేరిన ‘కార్వీ’ మోసం.. 5 వేల పేజీలతో ఛార్జీషీట్.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌లోని ఎయిర్పోర్ట్ బావార్చిలో…
టాలీవుడ్ బుల్లితెర నటి లహరిపై కేసు నమోదయ్యింది. మంగళవారం రాత్రి ఆమె తన కారులో వెళ్తూ ముందు వెళ్తున్న బైక్ ని ఢీకొన్నది.. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని లహరిని, కారును పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్లితెర నటి లహరి మంగళవారం అర్ధరాత్రి శంషాబాద్ రోడ్డు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వెళ్తోన్న…
చిన్నపాటి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, అధికారుల నిర్లక్ష్యం యువత ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడను ఢీకొని యువకుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద జరిగిన ఘటన ఇది. గొల్లపల్లి గ్రామానికి అనుకొని ఉన్న ఎయిర్ పోర్ట్ ప్రహారీ గోడను ఢీకొన్న నవీన్ అనే యువకుడు మరణించాడు. మలుపు వద్ద రోడ్డుకు ఎదురుగా ఉన్న ప్రహరీ కనిపించకపోవడంతో బైక్ తో ఢీకొన్నాడు యువకుడు. నవీన్ మృతి…