శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుకున్నారు. దోహ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ లేడి ప్యాసింజర్ వద్ద 53 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించారు డీఆర్ఐ అధికారులు. ఈస్ట్ ఆఫ్రికా జాంబియా నుండి భారీ మొత్తం లో మత్తు పదార్ధాలు హైదరాబాద్ కు ఎక్స్ పోర్ట్ అవుతున్నాయనే పక్కా సమాచారంతో శంషాబాద్ లో మాటు వేశారు డీఆర్ఐ అధికారులు. దోహా నుండి వచ్చిన ఆఫ్రికా దేశస్థురాలి పై అనుమానం వచ్చి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో అడ్డగించిన అధికారుల బృందం… తమదైన విచారణ చేయగా బయటపడ్డింది డ్రగ్స్ సరఫరా గుట్టు. ప్రయాణీకురాలు ”మాకుంభ కరోల్” ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు డీఆర్ఐ అధికారులు.