దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలను నిజం చేయటానికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ అన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొన్ని పార్టీల్లో భయం పట్టుకుందని విమర్శించారు. వైసీపీలో 2019కి ముందు రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఎక్కడ ఉంది?, ఇప్పుడు ఎక్కడ పెట్టారు అని ప్రశ్నించారు. వైసీపీ మోసపూరిత వైఖరి నచ్చకనే షర్మిల ఆ పార్టీకి దూరమయ్యారని మస్తాన్ వలీ…