భారతదేశం74 ఏళ్లుగా స్వాతంత్య్రాన్ని అనుభవిస్తోంది. రోజురోజుకూ ప్రపంచంలోని పెద్ద దేశాలలో ఒకటిగా మనదేశం కూడా అభివృద్ధి చెందుతోంది. కానీ ఈ స్వాతంత్ర్యం అంత సులభంగా రాలేదన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పాలనలో ఎన్నో దయనీయ, కౄర పరిస్థితులు చవి చూశారు మన పూర్వికులు. బ్రిటీష్ పాలన నుంచి భరత మాతకు విముక్తి కల్పించడానికి ఎంతోమంది రియల్ హీరోలు ప్రాణాలు అర్పించారు. భారతదేశం బ్రిటీష్ వారిపై ఎన్నో సంవత్సరాల…