IND Vs SA: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలుచుకున్న టీమిండియా జోరు మీద కనిపిస్తోంది. బుధవారం నుంచి సొంతగడ్డపై మరో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు సెలక్టర్లు ముందుగానే హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌కు విశ్రాంతి కల్పించారు. అటు కరోనా కారణంగా ఆసీస్‌తో సిరీస్‌కు దూరమైన షమీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆల్‌రౌండర్ దీపక్ హుడా కూడా…