ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో నగరం అతలాకుతలం అయిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో అత్యంత భారీ వర్షం కురవడంతో జనాలకు చుక్కలు కనిపించాయి.
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. స్పైస్‌జెట్ మరియు విస్తారా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు ఎక్స్‌లో పేర్కొన్నాయి.