తెలుగులో బిగ్‌బాస్-5 రసవత్తరంగా సాగుతోంది. కాంట్రవర్సీలతో హీట్ పుట్టించే ఈ రియాలిటీ షో ఏడో వారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఏడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వారం నామినేషన్‌లలో 8 మంది ఉన్నారు. అనీ మాస్టర్, లోబో, ప్రియ, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్, సిరి ఉన్నారు. వీరిలో ఈ వారం ప్రియ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.…