పంజాబ్ ముక్త్‌సర్‌లోని గిద్దర్‌బాహాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన చోటు చేసుకుంది. డేరా సిద్ధ్ బాబా గంగా రామ్ వార్షికోత్సవ కార్యక్రమంలో సిలిండర్ పేలడంతో ఏడుగురు సేవకులకు మంటలు అంటుకున్నాయి. కాగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో బటిండాకు రెఫర్ చేశారు. భటిండాకు రెఫర్ చేసిన వారిలో ముగ్గురికి 60-70 శాతం కాలిన గాయాలయ్యాయి. మరోవైపు పేలుడు శబ్ధం విని ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు.