అక్టోబర్ ప్రారంభంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలింది. భద్రతా దళాల కాల్పుల్లో దాదాపు 35 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా మరోసారి సుక్మా జిల్లాలో భద్రతా దళాలు వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించారు. అడవిలో జల్లెడ పట్టగా 19 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.