Mahesh Kumar Goud: రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతున్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అన్నారు.
Minister Seethakka: ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనలు రాజకీయ రగడకు దారితీసింది.
మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేటీఆర్ పనే అని ఆరోపించారు. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారు.. అమాయకులను బలి చేస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అధికారులను విదేశాల్లో దాచారని మంత్రి కొండా సురేఖా అన్నారు. బీఆర్ఎస్ ది తుగ్లక్ పాలన.. బీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టిందని దుయ్యబట్టారు.
Bandi Sanjay: కాళ్ళ నొప్పితో రెండు రోజులు కనపడలేదు దానికి ఇంత రాద్ధాంతం చేయాలా అని బీఆర్ఎస్ శ్రేణులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. లేచినా, పడుకున్నా.. బీఆర్‌ఎస్ నేతలకు నేనే గుర్తుకువస్తున్నా..
Kishan Reddy: ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాంనగర్ లో దుర్గంధం, వాసన రావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మూసీ పక్కన ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో ఒక్క తులసీ రాం నగర్ లో గుండెపోటుతో 9 నుంచి 10 మంది చనిపోయారన్నారు.
CM Revanth Reddy: అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు పార్లమెంట్‌కు పంపారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy: నగరంలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని కారణంగా కొత్త టెండర్లు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Ponnam Prabhakar: కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ASK KTR' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసి రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నానని కామెంట్స్ చేశారు. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు.
ట్రిపుల్ తలాక్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. షరియత్ కౌన్సిల్ ప్రైవేట్ సంస్థ అని, కోర్టు కాదని న్యాయమూర్తి అన్నారు. ప్రస్తుతం విచారించిన కేసు 2010లో వివాహం చేసుకున్న ముస్లిం డాక్టర్ దంపతులది. భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాడని.. అయితే మూడో తలాక్ పై భర్త ఎప్పుడూ ప్రస్తావించలేదని భార్య ఆరోపించింది.