Mahesh Kumar Goud: రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతున్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అన్నారు. గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన గ్రాడ్యుయేట్, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలో పేదవాడికి ఫలాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని కేవలం ఏడాదిలోనే ఎక్కువ చేసామన్నారు. పదేళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే 9 నెలల్లో 45వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసామన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించామన్నారు.
200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. గ్యాస్ సిలిండర్ రూ. 500 కే ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతున్నామన్నారు. ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అన్నారు.
Read also: Sreeleela : అమ్మ శ్రీలీల.. మస్త్ షేడ్స్ ఉన్నాయే నీలో.!
మరోవైపు ఇంచార్జ్ దీపదాస్ మున్షి మాట్లాడుతూ.. సమాజ సంక్షేమం కోసం బ్రిటిష్ పరిపాలనలో పోరాడిన మహనీయులు జ్యోతిరావు పూలే.. సావిత్రిబాయి పూలే అన్నారు. సమాజంలోని బలహీన వర్గాల వర్గాల కోసం కృషి చేసిన జ్యోతిరావు పూలే అని తెలిపారు. మహిళల విద్యా సంస్థలు ఏర్పాటు కోసం విజయంగా కృషి చేశారన్నారు. జ్యోతిరావు పూలే మార్గదర్శకంలో ప్రధాని నరేంద్ర మోడీ కేసీఆర్, కేటీఆర్ ఆచరించలేదన్నారు. కేవలం రాహుల్ గాంధీ ఆలోచించారన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకే కుల జన గణన ప్రారంభమైందన్నారు.
Minister Seethakka: ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర ఉంది.. మంత్రి సీతక్క సంచలన కామెంట్..