రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. ఏపీ విభజన సమయంలో తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందన్నారు. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైందని తెలిపారు. "నేను ఏ పార్టీని తప్పు పట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది నరేంద్ర మోడీ ప్రభుత్వమే.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటర్లపై పార్టీలు ఉచిత వరాల జల్లులు కురిపిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.
తీన్మార్ మల్లన్న విషయంలో తనకు మాట్లాడేంత టైమ్ లేదని.. మాట్లాడం వేస్ట్ అని అన్నారు. తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్లు పేపర్‌లో చూశానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 56.6 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చామని తెలిపారు.
విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని ఎక్స్ లో పేర్కొన్నారు.
చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదని ఆరోపించారు. ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేదిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువయ్యాయి... ఇలాంటి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడుతారని అన్నారు.
తెలంగాణ రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రివైంజ్ పాలిటిక్స్‌పై జగ్గారెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకం అని చెప్పారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ బోర్డు మెంబర్, సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సంఘటన దురదృష్టకరమైన.. దైవ సన్నిధిలో ప్రాణాలను కోల్పోవడం అదృష్టమన్నారు నెహ్రూ. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెల్లించే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు కారణమయ్యాయి.
తిరుపతి తొక్కిసలాట ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ అన్నారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు.
ఎలక్టోరల్ బాండ్లపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022లో.. ఫార్ములా ఈ- రేస్ జరిగింది 2023లోనని తెలిపారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు కాంగ్రెస్, బీజేపీకి కూడా ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ- కార్ రేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని అన్నారు.
Bandi Sanjay: అబద్దాలలో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు.