టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే మోహన్ బాబు తనయుడు కనుక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బిగినింగ్ లోనే తనేంటో నిరూపించుకున్నాడు. కానీ అతన్ని ఈ మధ్య కాలంలో తెరమీద చూసి చాలా కాలం అయ్యింది. కాగా ఇప్పుడు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మల్టీస్టారర్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు. దీంతో ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీస్.. కెరీర్ పరంగా మనోజ్‌కి బాగా కలిసిరావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. కానీ ప్రజంట్ మంచు ఫ్యామిలిలో జరిగిన గొడవలు మనకు తెలిసిందే. దీంతో మనోజ్‌కు ఫ్యామిలీ సపోర్ట్ పూర్తిస్థాయిలో లేదనే చెప్పాలి. మరి ఈ సెకండ్ ఇన్నింగ్ లో ఏ మాత్రం విజయం సాదిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ ఒక సందర్భంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
Also Read:Chandoo Mondeti: ఆ మాట వినగానే గుండెల్లో గునపం దించినట్లైంది : చందు మొండేటి
మనోజ్ మాట్లాడుతూ.. ‘ నన్ను తొక్కేయడానికి చాలా మంది నాన్న రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నన్ను తొక్కాలన్నా పైకి లేపాలన్నా ఫ్యాన్స్ వల్లే తప్పించి.. ప్రపంచంలో ఇంకెవరి వల్ల కాదు. మంచి పని కొరకు చేసే పోరాటంలో న్యాయం జరిగే వరకు వదిలిపెట్టను’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారు తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం దుమారం రేపుతున్నాయి.