టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీవీతో ఎంపీ మాట్లాడుతూ.. సీబీఎన్ పగటి కలలు కంటున్నారు.. తల కిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వరు అని ఆయన వ్యాఖ్యనించారు.
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A సుప్రీం కోర్టు భిన్నాభిప్రాయాలు పై సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తాదా, వర్తించదా అనే అంశంపై ఈరోజు తీర్పు రావాల్సి ఉన్నా.. సుప్రీం కోర్టులోనే త్రిసభ్య న్యాయమూర్తులలో భిన్నభిప్రాయాలు వెలువడిందని, ముమ్మాటికి ఇందులో రాజకీయ జోక్యం చోటుచేసుకుందని వ్యాఖ్యలు చేశారు.
మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్ చీకటే.. రాజధాని రైతులకున్న కీడు, పీడ తొలగిపోయే రోజులు దగ్గర ఉన్నాయి.. రాజధాని రైతులు పడ్డ కష్టం ఇబ్బందులను తీర్చడానికి టీడీపీ - జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షించేందుకు అరాచకవాదులను కాల్చి చంపాలనే ఉద్దేశంలో అప్పటి ప్రభుత్వం కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
ఎన్నికల వేళ టీడీపీ- జనసేన మళ్లీ కుట్రలకు తెరతీస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారన్నారు.
భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్నంత కాలం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడవు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకోవడం లేదు అని ఆయన చెప్పారు.
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మసీదులను కూడా తమ నుంచి తీసేసుకునే ఛాన్స్ ఉందన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తారని అంటున్నారు.. తెలుగు సత్తా చూపించేందుకు మోడీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు మోడీపై పోటీ చేస్తానని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తనది గ్యారెంటీ అన్నారు. తనలాంటి వాడికి పార్లమెంటు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు.
పాకిస్థాన్ దివాలా తీయడానికి కారణం భారత్, అమెరికా దేశాలు కారణం కాదని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. మన దరిద్రానికి మనమే కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మన కాళ్లను మనమే నరుక్కున్నామంటున్నామని పరోక్షంగా మిలట్రీపై తీవ్ర విమర్శలు విమర్శలు గుప్పించారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయి ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతల పాస్ పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేనిపక్షంలో వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని చెప్పారు. కేసీఆర్ హయాంలో పదవీ విరమణ చేసినప్పటికీ సీఎంఓలో పనిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ కేసీఆర్ కుటుంబానికి…