మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి జీవానం సాగిస్తున్న వారందరినీ గుర్తించి పంపించి వేస్తామని వెల్లడించారు.
తెలంగాణలో జరిగిన అతి పెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం డ్యామేజీలో ఉన్నాయన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు తమ కుటుంబం నుండి మూడు పదవులు ఉండాలి అనుకున్నామని మల్లారెడ్డి తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని అన్నారు. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చెయ్యడానికి సిద్ధం ఉన్నాడని చెప్పారు.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా తన కుమారుడితో తనకున్న రిలేషన్ షిప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రివాబాతో రవీంద్ర జడేజా వివాహం అయిన తర్వాత, అతని కొడుకుతో అతని సంబంధం మునుపటిలా లేదని అనిరుధ్ సింగ్ చెప్పాడు. కుటుంబంలో చీలిక రావడానికి రివాబా కారణమని అనిరుధ్ సింగ్ ఆరోపించారు. ఒకే నగరంలో నివసిస్తున్నప్పటికీ, తన కొడుకును కలవలేకపోతున్నాడని చెప్పాడు. రవీంద్ర జడేజా క్రికెటర్ కాకపోయి ఉంటే బాగుండేదని…
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు. నీ అయ్య ఎవడ్రా పడగొట్టేటోడు.. పడగొడతార్రా... ఎవడు కొట్టేది? అని దుయ్యబట్టారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం... ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం.. ప్రజల కోసం పని చేస్తోన్న ప్రభుత్వం... ఇది ప్రజా ప్రభుత్వం.. వాడు అనుకుంటున్నాడు... లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్లు ఈ ప్రభుత్వం కూలుతుందా అని…
KTR: ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భీమిలీలో వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావం సిద్ధం బహిరంగ సభ దగ్గర ఎన్టీవీతో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మేం దేనికైనా సిద్దం.. అభివృద్ధి చూపించేందుకు సిద్దం.. కలిసి వస్తున్న రాజకీయ పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. వైనాట్ 175 నినాధం మొదటి నుంచి వినిపిస్తున్నాం.. నేడు అదే నినాధంతో సిద్దమౌతున్నాను అని ఆయన వెల్లడించారు
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ప్రొఫెసర్, పౌర హక్కుల నేత హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇస్లామిక్ దేశాల తరహాలో భారతదేశంలోనూ మత విలువల ఆధారంగా ప్రత్యామ్నాయ రాజ్యాంగం రాబోతోందని హరగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు లేకపోతే చిన్న రాష్ట్రాల స్వేచ్ఛ ఉండేది కాదని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.. ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.