టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీవీతో ఎంపీ మాట్లాడుతూ.. సీబీఎన్ పగటి కలలు కంటున్నారు.. తల కిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వరు అని ఆయన వ్యాఖ్యనించారు. టీడీపీకి ఇవే ఆఖరి ఎన్నికలు.. చంద్రబాబు రాజకీయ జీవితాన్ని నారా లోకేష్ సమాధి చేసేశాడు.. చంద్రబాబు 40 సీట్లు వస్తే ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. జగన్ భారీ మెజారిటీతో మళ్ళీ ముఖ్యమంత్రి కావటం ఖాయం.. పోలవరాన్ని ప్రారంభించింది వైఎస్ రాజశేఖరరెడ్డి కదా.. మరి పోలవరం – సోమవారం అన్నది ఎవరు?.. వై నాట్ పులివెందుల కాదు.. ముందు చంద్రబాబును కుప్పంలో గెలిచి చూపించమనండి అని ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు.
Read Also: Niharika Konidela: వదినా ఆడపడుచుల డ్యాన్స్.. చూడముచ్చటగా ఉందే
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు.. చంద్రగిరిలో పోటీ చేసే దమ్ము ఉందా? అని కేశినేని నాని సవాల్ చేశారు. చంద్రబాబు తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు పిచ్చోడ్ని చేశాడు.. షర్మిలకు కూడా ముఖ్యమంత్రి కావాలని, ప్రధాని కావాలని ఉండొచ్చు.. తప్పుగా చూడాల్సిన పని లేదు.. 2013లోనే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తే తీయించేయమని నాతో చెప్పేవారు అని ఆయన వెల్లడించారు.