SSMB29 పై ప్రముఖ స్క్రీన్ రైటర్, దిగ్గజ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ క్రేజీ హింట్ ఇచ్చి మహేష్ అభిమానులను థ్రిల్ చేశారు. RRR సినిమా విడుదల సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “మహేష్ సినిమా కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కథను తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ పూర్తి చేసిన తర్వాత స్క్రిప్ట్‌పై దృష్టి సారిస్తారు”…