ఈ నాటి ప్రేక్షకులకు కేరెక్టర్ యాక్టర్ గా పరిచయమున్న నరేశ్ ను చాలామంది ‘సీనియర్ నరేశ్’ అంటూ ఉంటారు. కృష్ణ సతీమణి విజయనిర్మల తనయుడే నరేశ్. కృష్ణ హీరోగా నటించిన కొన్ని చిత్రాలలో బాలనటునిగా కనిపించిన నరేశ్, తల్లి దర్శకత్వం వహించిన ‘ప్రేమసంకెళ్ళు’తో ముందుగా కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే జంధ్యాల తెరకెక్కించిన ‘నాలుగు స్తంభాలాట’ లో నవ్వులు పూయిస్తూ జనం ముందు నిలిచారు. ఆ చిత్రంతోనే నటుడిగా మంచి పేరు…