సుప్రీంకోర్ట్ పనివేళలు మారతాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ఇవాళ చేసిన వ్యాఖ్యలు ఇదే ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జడ్జిలు కేసులపై విచారణలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం ఓ గంట ముందే విచారణలు ప్రారంభించింది. వాదనలు వినిపించేందుకు వచ్చిన సీనియర్ అడ్వకేట్ ముకుల్…
తెలంగాణ రాష్ట్రానికి చెందిన, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది పి.నిరూప్‌ను సీనియర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టు నియమించింది. తెలంగాణ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులైన తొలి న్యాయవాది నిరూప్. నిరూప్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ న్యాయవాది, మాజీ స్పీకర్, మంత్రి దివంగత పి. రామచంద్రారెడ్డి కుమారుడు. ఆయన మెదక్ జిల్లాకు చెందినవారు. 1985లో బార్ కౌన్సిల్‌లో చేరిన తర్వాత సంగారెడ్డిలోని మున్సిఫ్ కోర్టులో ప్రాక్టీస్ చేసి సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2017-2018కి ఢిల్లీలోని మేఘాలయ, షిల్లాంగ్ రాష్ట్రానికి…