Nvidia: ఎన్విడియా(Nvidia) కంపెనీ చరిత్ర సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన మొదటి కంపెనీగా అవతరించింది. 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్న 4 నెలల్లోనే ఈ ఘనట సాధించడం గమనార్హం. కంపెనీ విలువ ఇప్పుడు మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ కన్నా ఎక్కువ. యూరప్ స్టాక్స్ సూచిక Stoxx 600లో సగం విలువకు సమానంగా నిలిచింది. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ 1993లో ఈ కంపెనీని స్థాపించాడు. అప్పటి నుంచి ఈయనే…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించనున్నారు. ఇది భారత్ లోనే అతిపెద్ద సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ షో. ఇందులో 33 దేశాల నుంచి 350 కి పైగా టెక్ కంపెనీలు పాల్గొనబోతున్నాయి. సెమీకండక్టర్ పరిశ్రమలో భారతదేశాన్ని సూపర్ పవర్‌గా మార్చడం, సాంకేతిక ప్రపంచంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమం లక్ష్యం. పీఎం మోడీ సోమవారం సాయంత్రం X ఖాతాలో ఓ పోస్ట్ పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 2న ఉదయం 10…
Intel layoffs: మరో టెక్ సంస్థ భారీ మొత్తంలో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. చిప్‌మేకర్ ‘‘ఇంటెల్’’ పునర్నిర్మాణంలో భాగంగా ఏకంగా 25,000 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని భావిస్తోందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. 2025 చివరి నాటికి తన ఉద్యోగుల సంఖ్యను 75,000 మందికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది చివరి నాటికి ఇంటెల్‌లో మొత్తం 1,08,900 మంది ఉద్యోగులు ఉన్నారు.
Minister Sridhar Babu: మినిస్టర్ క్వార్టర్స్‌లో "NXP సెమీ కండక్టర్స్" ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమైయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి కోరారు.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంటకు పైగా కొనసాగింది. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఐదు ప్రధాన అంశాలపై ప్రధానితో సీఎం చర్చించారు. ప్రధాన అంశాలు: హైదరాబాద్ మెట్రో & ఆర్‌ఆర్‌ఆర్ రింగ్ రోడ్డు: హైదరాబాద్ మెట్రో రైల్ వేస్ టు విస్తరణ కోసం రూ. 24,269 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి. రంగారెడ్డి రింగ్ రోడ్డు (RRR) అభివృద్ధికి…
SSIA: తెలంగాణ పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు సింగపూర్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ (SSIA)తో ప్రత్యేక రౌండ్ టేబుల్ చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో SSIA ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొని, తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బ్రియాన్ టాన్ (SSIA ఛైర్మన్), టాన్ యూ కాంగ్ SSIA వైస్ ఛైర్మన్, గ్లోబల్ ఫౌండ్రీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్), అప్లైడ్ మెటీరియల్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో…
Central Cabinet Decisions: ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ రైతాంగం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతాంగం కోసం రూ.13,966 కోట్లను కేంద్రం కేటాయించింది. రూ. 2817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేయనుంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా వ్యవసాయానికి టెక్నాలజీని జోడిస్తూ రైతులకు మరింత మేలు చేయాలని కేంద్రం భావిస్తోంది. రైతులు లోన్ తీసుకోవడం వచ్చే రోజుల్లో కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి కానుంది.