సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. కరోనా నివారణకు తీసుకునే కోవోవాక్స్ టీకా ధరను భారీగా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు కోవోవాక్స్ వ్యాక్సిన్ డోస్ ధర రూ.900 ఉండగా.. రూ.225కి తగ్గిస్తున్నట్లు సీరమ్ కంపెనీ తెలిపింది. అయితే జీఎస్టీ అదనంగా ఉంటుందని సూచించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ టీకాను తీసుకుంటే సర్వీస్ ఛార్జీగా రూ.150 వరకు వసూలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కరోనా టీకా ధరను తగ్గించిన…