Harish Rao: పాశమైలారం పరిశ్రమ పేలుడు ఘటనపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నేడు జరిగిన పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించేందుకు హరీష్ రావుతో పాటు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రావు కలిసి పటాన్ చెరులోని ధ్రువ ఆసుపత్రిని సందర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని పరిశీలించారు. Read Also:Reactor…
Reactor Blast: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి పరిశ్రమ తునాతునకలైంది. ఇప్పటివరకు 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. Read Also:Kubera : పదేళ్లకే…