New criminal laws: కేంద్రం కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలను తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన బిల్లులను ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. దీనిపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో మాట్లాడారు. ఇకపై మూకదాడికి పాల్పడిన నేరాల్లో మరణశిక్ష విధించే నిబంధన ఉందని చెప్పారు. అలాగే స్వాతంత్ర సమరయోధులను జైలులో పెట్టడానికి బ్రిటీష్ వారు తీసుకువచ్చిన దేశద్రోహ చట్టాన్ని తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు అమిత్ షా ప్రకటించారు.
Law Commission: గత కొంత కాలంగా దేశద్రోహ చట్టం(sedition) చట్టం తొలగింపు, అమలుపై కీలక చర్చ జరుగుతోంది. దేహ్రద్రోహ చట్టం దుర్వినియోగం అవుతోందని పలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ నుంచి కేరళ, పంజాబ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రత, సమగ్రతను రక్షించేందుకు దేశద్రోహ చట్టం కీలక సాధనమని ఆయన పేర్కొన్నారు.
చట్టాలు కొందరికే చుట్టాలు. మన దేశంలో చాలా ఈజీగా ఈ కామెంట్ పాస్ అవుతూ ఉంటుంది. దీనికి కారణాలు లేకపోలేదు. చట్టాల అమలు తీరు అలా ఉంటుంది. రాజకీయ, వ్యక్తిగత కక్షలకు దుర్వినియోగం అయ్యే చట్టాలు అనేకం. వీటిల్లో కొన్ని ప్రమాదకర చట్టాలు కూడా ఉంటాయి. ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శతాబ్దాల క్రితం బ్రిటిషర్లు రూపొందించిన IPCలో కొన్ని సెక్షన్లు ఇప్పటికీ భారతీయులకు ఉరితాడుగానే ఉన్నాయి. అందులో 124A ఒకటి. తదుపరి సమీక్ష జరిగేవరకు ఈ…
దాదాపు 150 ఏళ్ల నాటి రాజద్రోహ సెక్షన్ 124ఏ చట్టం అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కోర్టు తీర్పును ప్రభావితం చేసేలా మోదీ సర్కారు ఎన్ని ట్రిక్కులు వేసినా, చట్టాన్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష పూర్తయ్యి, కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఈ చట్టంకింద ఎటాంటి కేసులు, చర్యలు తీసుకోవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అలాగే, ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో ప్రస్తుతం…
దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న దేశద్రోహం కేసులపై ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. దేశద్రోహ నేరాన్ని నేరంగా పరిగణించే IPCలోని సెక్షన్ 124Aలోని నిబంధనలను పునఃపరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి మంజూరుచేసింది. ఈ కేసులకు సంబంధించిన పునఃపరీక్ష పూర్తయ్యే వరకు 124ఏ కింద ఎలాంటి కేసు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దేశద్రోహ చట్టాన్ని నిలిపివేయాలని సీజే ఎన్వీ రమణ ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. దేశద్రోహం కేసుపై ఇవాళ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.…
దేశంలో గత కొన్ని రోజులుగా దేశద్రోహం చట్టం పేరు బాగా వినిపిస్తున్నది. ఈ చట్టంపై సుప్రీంకోర్టు ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న తరుణంలో బ్రిటీష్ కాలానికి చెందిన, వలస తెచ్చుకున్న చట్టం అవసరమా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను విచారించే సమయంలో కోర్టు ఈ రకంగా స్పందించింది. Read: పాన్ ఇండియా మూవీ లేకుండానే…