మనం సాధారణంగా బస్సుల్లో ప్రయాణించేటప్పుడు టికెట్ కొనడం జరుగుతుంది. కానీ విద్యార్థులందరికీ ప్రతిరోజూ టికెట్ కొనడం సాధ్యం కాకపోవచ్చు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు బస్ పాస్‌లు అందిస్తున్నాయి. ఇవి సాధారణ టికెట్లతో పోలిస్తే భారీ రాయితీతో లభిస్తాయి.అయితే ఇలాంటి రాయితీలు రైళ్లలో కూడా లభిస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇది నిజం.
పూర్తి వివరాల్లోకి వెళితే..చాలా మంది విద్యార్థులు ప్రతిరోజూ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. కారణం—అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు బస్‌పాస్‌ల ద్వారా రాయితీ సౌకర్యం అందుబాటులో ఉండటం. అంతేకాకుండా పరీక్షల సమయంలో ఉచిత లేదా ప్రత్యేక రాయితీ బస్సు సౌకర్యాలు కూడా కొన్ని రాష్ట్రాలు కల్పిస్తాయి. అదే విధంగా రైల్వేలో కూడా విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. చాలామందికి ఈ విషయం తెలియక అర్హత ఉండి కూడా ఈ సౌకర్యం ఉపయోగించుకోలేకపోతున్నారు.
విద్యార్థులు బస్ పాస్ తీసుకునే విధంగానే, రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్‌కి వెళ్లి తమ స్కూల్/కాలేజ్ ఐడెంటిటీ కార్డ్ చూపించి
స్టూడెంట్ కన్సెషన్ టికెట్ పొందవచ్చు. రైల్వే శాఖ నిబంధనల ప్రకారం స్కూల్ & కాలేజ్ విద్యార్థులకు 50% నుండి 75% వరకు టికెట్‌పై రాయితీ లభిస్తుంది.సాధారణ (General) కేటగిరీ విద్యార్థులకు 50% రాయితీ, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 75% రాయితీ అందిస్తోంది.
అయితే…IRCTC యాప్ లేదా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ఈ రాయితీ లభించదు.ఈ రాయితీ కేవలం రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ సౌకర్యం 12 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులకు వర్తిస్తుంది. ఈ సమాచారం మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీకు ఏదయినా సందేహాలు ఉంటే.. మీకు దగ్గరల్లోని రైల్వే స్టేషన్ కు వెళ్లి సమాచారం పొందవచ్చు.