కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆది నారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పద్మావతి వర్శిటి స్టాంగ్ రూమ్ దగ్గుర పోలీసులు భారీ భద్రతతో పాటు 144 సెక్షన్ విధించారు. లివర్తి నానిపై దాడికి పాల్పడింది మొత్తం 30 మంది అని పోలీసులు గుర్తించారు. అందులో ఇప్పటి వరకు ముగ్గురుని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారంతా పరారీలో ఉన్నట్లు సమాచారం. వెంటనే అరెస్ట్ చేయకపోతే చంద్రగిరిని దిగ్భందిస్తామని పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి హెచ్చరించింది.
Lokshabha Elections 2024: రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సోమవారం (మే 13) ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 గంటల తరవాత స్థానికేతరులు కానీ.. రాజకీయ నేతలంతా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని సూచించారు. పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందని తెలిపారు. మరోవైపు.. అనకాపల్లి, అనంతపురం, ప.గో, తూ.గో, కర్నూలు జిల్లాల్లో నూరు శాతం వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని చెప్పారు. మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6…
Rangareddy: రోడ్డు వివాదం ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పరస్పర దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి తల ఒకరు కొట్టుకున్న ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
144 Section in Delhi ahead of Farmers Protest: తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ పేరుతో రైతులు ఆందోళన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రైతుల మెగా మార్చ్ నేపథ్యంలో ఢిల్లీలో నెల రోజుల పాటు (మార్చి 12 వరకు) 144 సెక్షన్ విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అశాంతి మరియు భద్రతా సమస్యల ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీ సరిహద్దులు సింగు,…
Karnataka: కర్ణాటక మాండ్యా జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని కేరగోడు గ్రామంలో ప్రజలు 108 అడుగుల ఎత్తున హనుమాన్ జెండాను ఆవిష్కరించారు. అయితే, ఈ రోజు తెల్లవారుజామున స్థానిక అధికారులు ఈ జెండాను తొలగించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. కాషాయ జెండాను ఎగరేసినందుకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు బలవంతంగా జెండాను తీయించారు.
Manipur : గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో హింస చెలరేగుతోంది. రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య హింస తీవ్ర రూపం దాల్చింది. ఈ కాలంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు.
మణిపూర్‌లో ప్రభుత్వం 5 రోజుల పాటు మొబైల్ డేటా సేవలను నిలిపివేసింది. మణిపూర్ అంతటా మొబైల్ డేటా సేవలను ఐదు రోజుల పాటు నిలిపివేసినట్లు ప్రత్యేక కార్యదర్శి (హోమ్) హెచ్ జ్ఞాన్ ప్రకాష్ శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు.