Rangareddy: రోడ్డు వివాదం ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పరస్పర దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి తల ఒకరు కొట్టుకున్న ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మిర్జాగూడ గేటు నుంచి జన్వాడ గ్రామం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అయితే గ్రామంలోని ప్రధాన కూడలిలోని క్రైస్తవ ప్రార్థనా మందిరానికి ఆనుకుని రోడ్డు నిర్మించలేదని కొందరు యువకులు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.
Read also: India- Pakistan: పాకిస్థాన్ డ్రోన్లపై భారత సైన్యం కాల్పులు..
దాడిలో 200 మంది పాల్గొన్నగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బుధవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రామానికి చేరుకుని దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేయడంతోపాటు 20 మందిని అదుపులో తీసుకున్నారు. ఓ దళిత కార్యకర్త హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి ప్రవీణ్‌ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. గత రెండు రోజులుగా సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనవాడలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బలగాలను మోహరించారు. మరోవైపు జన్వాడలో ఫిబ్రవరి 21 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ అవినాష్ మహంతి తెలిపారు.
UPI NPI Linkage: నేపాల్ ఎన్పీఐతో యూపీఐ లింక్.. ఇక పేమెంట్స్ ఈజీ