లార్డ్స్ వేదికగా కీలక సమరానికి టీమిండియా, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. తొలివన్డే విజయం ఇచ్చిన ఊపులో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకునేందుకు ఇండియా తహతహలాడుతోంది. తొలివన్డేలో బుమ్రా, షమీ సహా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఆపై కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్, శిఖర్ ధావన్ బ్యాటింగ్‌తో పది వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. రెండో వన్డేలోనూ ఇదే దూకుడైన ఆటతీరు ప్రదర్శించాలని టీమిండియా భావిస్తోంది. గాయం…