ఈమధ్యకాలంలో కార్లలో మంటలు తీవ్ర ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. రోడ్ల మీద, హైవేల మీద వెళుతున్న వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తున్నాయి. కొంతమంది దురదృష్టవశాత్తూ కొందరు సజీవ దహనం అయిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ చెక్ పోస్ట్ వద్ద స్కార్పియో వాహనంలో ఒక్కసారి మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం పసిగట్టడంతో వాహనం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగే సమయానికి వాహనంలో ఇద్దరు ప్రయాణికులు వున్నారు. వారంతా బయట పడడంతో తృటిలో తప్పింది…