ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి విడుదలైన స్కార్పియో ఎస్‌యూవీ చాలా పాపులర్ అయ్యింది. ఈ ఎస్‌యూవీ న్యూ జనరేషన్ వెర్షన్ కోసం వాహన ప్రియులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. న్యూ జనరేషన్ మహీంద్ర స్కార్పియో కోసం కస్టమర్ల నిరీక్షణకు తెరపడనుంది. జూన్ 27న రానున్న స్కార్పియో-ఎన్ ఇమేజ్‌లను కంపెనీ విడుదల చేసింది. 2022 మహీంద్ర స్కార్పియోను మహీంద్ర స్కార్పియో-ఎన్‌గా కస్టమర్ల ముందుకు తీసు రానుంది మహీంద్రా. న్యూ ఎస్‌యూవీతో పాటు…